ముంబైలో లగ్జరీ హౌస్ కొన్న నాని హీరోయిన్.. ధర తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది..

మృణాల్ ఠాగూర్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాల్లో సాంప్రదాయ బద్దంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రియల్ లైఫ్ లో ఇందుకు భిన్నంగా గ్లామర్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. రోజురోజుకు అందాల ఆరబోతలో బాండరీస్ దాటేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెటింట ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉండే మృణాల్.. ఈ పిక్స్‌తో నెట్టింట‌ సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ అమ్మడి గురించి తాజాగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

తెలుగులో టాప్ రేంజ్ క్రేజ్ ద‌క్కించుకున్న మృణాల్‌ ప్రస్తుతం వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఇటీవల కాలంలో ఆమెకు కోలీవుడ్ లో కూడా పలు అవకాశాలు క్యూ కడుతున్నాయి అంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మృణాల్‌ ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని అందేరీ ప్రాంతంలో ఓ ఖరీదైన హౌస్‌ను తన సొంతం చేసుకుందట. అయితే ఈ ఫ్లాట్ కంగనా రనౌత్ తండ్రి బ్రదర్స్‌ద‌ని సమాచారం. ఇంటి విలువ రూ.4 నుంచి 5 కోట్లు దాకా ఉంటుందట. హైదరాబాద్ లో కూడా కొత్త ఇంటిని కొనుగోలు చేసే ఆలోచన లో ఉంద‌ట మృణాల్‌. ఇక ప్రస్తుతం రెండు భారీ సినిమా చాన్సులు కూడా ఈ బ్యూటీకి దక్కాయని వార్తలు వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్‌లో స్టార్ హీరో అజిత్, శింభు సరసన అవకాశాలు దక్కించుకుందట. తాజాగా రిలీజ్ అయిన మార్క్ ఆంటోనీ మూవీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్.. అజిత్ హీరోగా ఈ సినిమాను తర్కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్‌ను హీరోయిన్గా తీసుకుంటున్నారట. ఈ సినిమాలో ఛాన్స్ వస్తే ఇక అమ్మడి రేంజ్‌ మరింతగా పెరిగిపోతుంది. ఇక యంగ్‌ శివ కార్తికేయన్.. మురుగదాస్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలో మృణాల్‌ హీరోయిన్ గా నటిస్తుందట. ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్‌ పైకి రానున్నాయి. అలాగే శింబు హీరోగా, స్టార్ హీరో కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సినిమాలో కూడా మృణాల్‌ హీరోయిన్ గా నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. ఇలా వ‌రుస లైన‌ప్‌తో ప్రిన్స‌స్ నూర్‌జ‌హాన్ ఫుల్ బిజీ అయిపోతుంది.