దానికోసం ఆటోలో తిరుగుతున్న రకుల్.. వీడియో వైరల్..!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అందడం లేదు. ఇక ఇటీవల తన ప్రియుడుతో పెళ్లి అంటూ అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల ఫిబ్రవరి 21న రకుల్ ప్రీత్ సింగ్ మరియు తన ప్రియుడి వివాహం గోవాలో జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక వీరి వివాహానికి 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ షాపింగ్ మొదలుపెట్టింది. ఇక పెళ్లి షాపింగ్ అంటే కారులలో వెళుతూ ఉంటారు ప్రతి ఒక్క సెలబ్రిటీస్. కానీ రకుల్ మాత్రం స్పెషల్ గా ఆటోలో వెళ్లి షాపింగ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన పలువురు రకుల్ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)