మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి పడేసిన హరీష్ శంకర్.. ఫోటో వైరల్..!

ప్రస్తుతం మాస్ మహారాజ్ హీరోగా నటించిన సినిమా ” ఈగల్ ” మూవీ ఈనెల 9న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ టాక్ ని సైతం సొంతం చేసుకుంది.

ఇక దీంతో రవితేజ నెక్స్ట్ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరో సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే ” మిస్టర్ బచ్చన్ “. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి కూడా పీపుల్ మీడియానే నిర్మాణం వహిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది.

లేటెస్ట్ గా ఈ మూవీ రెండో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లుగా దర్శకుడు హరీష్ శంకర్ ఓ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ షెడ్యూల్లో సినిమాటోగ్రాఫర్ అయనాంక్ బోస్ కి చాలా థాంక్స్ చెప్తున్నాను అని అలాగే సినిమా కోసం చాలా కష్టపడుతున్న మాస్ మహారాజ్ రవితేజ గారికి మిలియన్ కొద్దీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ హరీష్ శంకర్ తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.