ఓ మై గాడ్.. కొత్త సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న సంయుక్త.. ఎంత కష్టపడుతుందంటే..

సంయుక్త మీన‌న్‌ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. త‌న‌ నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన బింబిసారా, సార్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు సంయుక్త మీనన్ చేసిన సినిమాలన్నీ లోకల్ సినిమాలు కాగా.. మొట్టమొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలో నటిస్తుంది సంయుక్త.

ఈ క్రమంలో ఆమె ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుందట. దీనికోసమే ఎంతో కష్టపడుతుందని తెలుస్తుంది. తాజాగా ఆమె సినిమా కోసం ఓ సాహసం కూడా చేయబోతుందట. ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోను తాజాగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోతో పాటు ఓ ఇంట్ర‌స్టింగ్ నోట్ కూడా రాసుకొచ్చింది. తను స్వయంభు సినిమా షూటింగ్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాను అంటూ వివరించింది.

ఇలా హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని.. గుర్రాలతో ఒక మంచి కనెక్షన్ కూడా ఏర్పడినట్లు అనిపిస్తుంది అంటూ వివరించింది. 2024 తన జీవితంలో మరింత కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఇచ్చింది అంటూ రాసుకు వచ్చింది. ఇక తాను ఎప్పుడూ కంఫర్టబుల్గా ఉండడానికి ఇష్టపడనని ఒళ్ళు వంచి కష్టపడడానికే ప్రయత్నిస్తాను అంటూ వివరించింది. ప్రస్తుతం సంయుక్త చేసిన ఈ పోస్టుతో పాటు ఆమె హార్స్ రైడింగ్ చేస్తూ కనిపించిన పిక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో సంయుక్త ఫ్యాన్స్ ఆ పిక్ ను మ‌రింత‌ ట్రెండ్ చేస్తున్నారు.