డార్లింగ్ ప్రభాస్ కోసం దీపిక ఏం చేసిందో తెలుసా..? సినీ ఇండస్ట్రీలోనే ఇది ఓ సంచలనం..!

ప్రజెంట్ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమా “కల్కి 2898 ఏడి” . ఈ సినిమా కోసం ఎంతమంది అభిమానులు ఈగర్ గా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది అంటూ మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

 

కాగా ఈ సినిమాలో భారీ తారగానం ఉంది . కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దీపికా పడుకొనె గ్లోబల్ బ్యూటీ. గ్లోబల్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. అలాంటి బ్యూటీ కల్కి సినిమాలో నటిస్తుంది అనగానే హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి .

అయితే రీసెంట్గా సినిమా ఇండస్ట్రిలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీపికా పదుకొనే ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ ఛార్జ్ చేయనటువంటి రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట. దీపికా పదుకొనే ఈ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ రేంజ్ లో ఏ హీరోయిన్ కూడా పుచ్చుకోలేదట. ఇప్పటివరకు ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనికేషన్ పుచ్చుకున్న హీరోయిన్ నయనతార మాత్రమే . రీసెంట్ గా తెరకెక్కిన జవాన్ సినిమా కోసం 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ దీపికా పదుకొనే ఏకంగా 20 కోట్ల పారితోషకం పుచ్చుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!