లావణ్య కి వరుణ్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..? మెగా హీరో టూ రొమాంటిక్ ఫెలోనే.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రొమాంటిక్ కపుల్ అంటే అందరూ బాగా చెప్పే పేరు సమంత – నాగచైతన్య . అదే ఇప్పుడు రొమాంటిక్ కపుల్ అంటే అందరు చెప్పే పేరు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి. మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ తన సినిమాల విషయంలో ఎంత పకడ్బందీగా ముందు నుంచే ప్లానింగ్ లో ఉంటాడు మనకు తెలిసిందే. అందరిలాగా ఒకే డప్పు కొట్టుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలను ఓకే చేస్తూ ఉంటాడు .

కాగ ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠిను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి గ్రాండ్గా ఇటలీలో జరిగింది . అయితే ఇంతవరకే అందరికీ తెలుసు . వరుణ్ లావణ్యలలో మొదటి ప్రపోజ్ చేసింది ఎవరు? ఎలా ఎవరికి ప్రపోజ్ చేశారో..? అన్న విషయం రీసెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు వరుణ్ తేజ్. దీంతో ఇదే విషయం నెట్టింట వైరల్ అవుతుంది.

మొదట వరుణ్ నే లావణ్య కు ప్రపోజ్ చేశాడట . అయితే ఐ లవ్ యు అంటూ కాకుండా ఏకంగా రింగ్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా..? అంటూ ప్రపోజ్ చేశారట . సేమ్ ఆయన కెరియర్ లో బిగ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన తొలిప్రేమ మూవీ లోని క్లైమాక్స్ సీన్ లో లా లావణ్యతో అప్లికేబుల్ చేశారట . లావణ్య కూడా ఐ లవ్ యు అంటూ కాకుండా పెళ్లి చేసుకోవాలి అని అడగడంతో ఓకే చెప్పేసిందట . ఆ తర్వాత కొన్నాళ్లు గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది..!!