సందీప్ రెడ్డి వంగపై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ బ్యూటీ.. వాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చిందిగా..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ భూమి పడ్నేకర్ ఇటీవల భ‌క్షక్‌ సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పుల్‌కిత్‌ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించిన ఈ సినిమాకు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, గౌరవ్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఇన్వెస్టిగేటివ్ ప్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాల్లో భూమి పడినేకర్ జర్నలిస్ట్ వైశాలి సింగ్ పాత్రలో కనిపించింది. ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్‌కి ముందే మంచి హైప్‌ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా తరికెక్కడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూల సందడి చేసింది భూమి ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఆమె స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. స్త్రీని తక్కువ చేసి ఎవరు మాట్లాడిన నేను అసలు భరించను.. అలాంటి వారికి నేను చాలా ఆపోజిట్. కానీ ఆ కోపంలో అర్థం ఉండాలి. రియాక్షన్ నిజాయితీగా ఉండాలి. మనకు నచ్చిందే కరెక్ట్ అని వాదించడం మూర్ఖత్వం. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన యానిమల్ మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాపై చాలా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. స్త్రీలను కించపరిచే విధంగా ఉంది అంటూ వాళ్లు విమర్శించారు. అయితే సినిమాలో క్యారెక్టర్ లను క్యారెక్టర్లుగానే చూడాలి. సందీప్ వంగా కథను దృష్టిలో పెట్టుకుని సినిమాను అలా తెరకెక్కించారు.

దాన్ని ఉద్దేశించి మనం మాట్లాడాలి.. సినిమాలో అన్ని క్యారెక్టర్లు విభిన్నంగా ఉంటాయి. వాటిని మనం సినిమా పరంగా చూడాలి తప్ప అదేదో మన సమస్యల భావించి మాట్లాడడం తప్పు. నా ఉద్దేశ్యం ప్రకారం తను అనుకున్న వ్యక్తిత్వాలను అద్భుతంగా చూపించడంలో సందీప్ సక్సెస్ అయ్యారు. ఇలా చూస్తే అతని అభినందించాలి అంటూ.. సందీప్ నుండి అన్ని ఇలాంటి సినిమాలే వస్తాయని భావించకూడదు.. అతను మంచి డైరెక్టర్ దీనికి భిన్నమైన సినిమా కూడా అతని నుంచి రావచ్చు. నా వరకు ఒక యాక్టర్ గా ఇందులో నటించిన నటినటులు అందరూ అద్భుతంగా మెప్పించారు. సినిమాను సినిమాగా చూడండి అంటూ యానిమల్ పై విమర్శలు కురిపించిన వారందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానమిచ్చింది.