పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్.. ఇది కదా మాస్ అంటే.. ఇండస్ట్రీ హిట్ పక్కా..

సినీ ఇండస్ట్రీలో చాలామంది చిన్న హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ స్టార్ డంను తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఓసారి స్టార్ హీరోగా పాపులర్ అయిన తర్వాత ఆ స్టార్ స్టేట‌స్ నిలబెట్టుకోవాలన్న అహర్నిశలు శ్రమ పడాలి. ఇలాంటి క్రమంలోనే అట్లు అర్జున్.. స్టార్ హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకుని నేషనల్ అవార్డును దక్కించుకున్న బన్నీ.. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమా కూడా పార్ట్ 1 రేంజ్ లోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు చేస్తుందంటూ సినిమా యూనిట్ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మరోసారి బాలీవుడ్ ని షేక్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమా నుంచి ఓ డైలాగ్ లీక్ అయింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే మంగళం శీను, ఆయన భార్య అయిన కాత్యాయని ఇద్దరు కలిసి పుష్పాన్ని చంపడానికి స్కెచ్ వేస్తారు. అందులో భాగంగా ఫేక్ పోలీసులతో పుష్పను అరెస్ట్ చేస్తారు. ఆ పోలీసులు డైరెక్ట్ గా పుష్పాను మంగళం శీను ఇంటికి తీసుకువెళ్తారు. అయితే ఆ ఇంటికి వచ్చిన పోలీసులు మంగళం శీను పంపిన పోలీసులు కాదని తెలియడంతో అతడు రివర్స్ ఎటాక్ మొదలు పెడతాడు.

అప్పుడు పుష్ప తన స్టైల్ లో తనను తాను ప్రొటెక్ట్ చేసుకుని.. ఆ పైట్ మ‌ధ్య‌లో ఊర మాస్ డైలాగ్ చెప్తాడు. చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ ఒకటే ఉంటే సరిపోదు.. దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి అంటూ పవర్ఫుల్ మాస్ డైలాగ్ వేసి అక్కడ ఉన్న వారిని చంపేసి వెళ్ళిపోతాడు. పుష్ప చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. డైలాగ్ చూస్తుంటేనే సినిమాలో ఎంత కంటెంట్ ఉంటుందో అర్థమవుతుంది అంటూ.. ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రియల్ హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.