కల్కి విషయంలో ఆ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్.. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న రెబల్ స్టార్.. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు భారీ తారాగణం నటిస్తుంది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు వైజయంతి మూవీ సక్సెస్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా రిలీజ్ ను ప్లాన్ చేశారు.

కాగా ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ సెంటిమెంట్ క‌ల్కి సినిమాకు రిపీట్ అవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటి.. ఏం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాకు బాహుబలి 2 బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందట. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ జాతకం మారిపోయిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ తో టీజర్ చూపించిన రెబల్ స్టార్ పార్ట్ 2 తో బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్లతో చరిత్ర సృష్టించాడు. అయితే ఆ తరువాత ప్రభాస్ కు మరోసారి ఆ రేంజ్ హిట్ పడలేదు. అయితే కల్కి సినిమాతో మరోసారి ఆ రేంజ్ హిట్ పడబోతుందని తెలుస్తుంది.

నాగ్‌ అశ్విని తెరకెక్కిస్తున్న ఈ కల్కి కూడా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతుందట. మొదటి పార్ట్ టీజర్ లుక్ లాగా రిలీజ్ చేసి.. రెండవ భాగంలో మొత్తం రివీల్‌ చేస్తారని తెలుస్తుంది. మే 9న రిలీజ్ కాబోతున్న మొదటి భాగం, రెండో భాగం షూటింగ్ కూడా ఒకేసారి నాగ్‌ అశ్విని కంప్లీట్ చేసేస్తున్నాడట. దీని రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. కల్కి 2898 ఏడి కి బాహుబలి కి మధ్య కొన్ని చిన్న చిన్న పోలికలు కూడా ఉన్నాయని.. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా మరోసారి బ్లాక్ బస్టర్ రికార్డులను బద్దలు చేస్తుందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అయింది. ఆ ఇయర్ సమ్మర్ మొత్తానికి ప్రభాస్ ఒక్కడే కింగ్.

బాహుబలి 2 వచ్చిన 45 రోజుల తర్వాత 2017 జూన్ 23న అల్లు అర్జున్ డీజే విడుదలైనా.. ఆ నెలన్నర కూడా బాహుబలికి ఎటువంటి డిస్టబెన్స్ రాలేదు. చూస్తుంటే 2024 లోను మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా అనిపిస్తుంది. ఇక ఆల్రెడీ వైజయంతి మూవీస్ లక్కీ సెంటిమెంట్.. జగదేకవీరుడు, అతిలోకసుందరి, మహానటి రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మే 9నే కల్కి కూడా రిలీజ్ కాబోతోంది. పైగా 2017లో డీజేతో వచ్చినట్లు ఇప్పుడు పుష్ప 2 తో.. కల్కి వచ్చిన రెండు నెలలకు పుష్ప రిలీజ్ అవుతుంది. అయితే నాని, విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్ హీరో సమ్మర్ లో వస్తున్న కల్కి రేంజ్ లో అయితే ఆ సినిమాలకు హైప్‌ ఉండదు. దీంతో ప్రభాస్ మరోసారి సోలోగా బ్లాక్ బ‌స్టర్ రికార్డులు వ‌ద్దలు చేసి సక్సెస్ అందుకుంటాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.