బ్రేకప్ స్టోరీ రివీల్ చేసిన బేబీ హీరో..ఆ అమ్మాయిని నిజాయితీగా ప్రేమించా.. హార్ట్ బ్రేక్ చేసిందంటూ..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొర‌శాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్.. పలు సినిమాల్లో నటించి త‌నకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇక సాయి రాజష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో హీరోగా నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సినిమాల్లో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. కథ‌ల ఎంపికలో జ‌గ్ర‌త‌లు తీసుకుంటూ.. వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలో నటిస్తున్న ఆనంద్ దేవరకొండా.. బేబితో బ్లాక్ బస్టర్ మూవీని సొంతం చేసుకున్నాడు.

అందులో హీరోయిన్‌ను గాఢంగా ప్రేమిస్తాడు. అయితే అంత తారుమారు కావడంతో ఆ అమ్మాయి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. దీంతో మందుకి బానిసై ప్రియురాలిని మర్చిపోలేక నరకాన్ని చూస్తాడు. కాగా రీల్ లైఫ్ లోనే కాదు ఆనంద్ దేవరకొండ రియ‌ల్ లైఫ్‌లోనూ అలాంటి నరకం చూసాను అంటూ వివరించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంద‌డి చేసిన ఆనంద్ దేవరకొండ తన ఫస్ట్ బ్రేకప్ స్టోరీని రివీల్‌ చేశాడు. ఇదే నా ఫస్ట్ లవ్ స్టోరీ.. నేను ప్రేమించిన అమ్మాయి.. పై చదువుల కోసం చికాగో వెళ్లింది..

నేను కూడా అమెరికా వెళ్దామని మొద‌టి నుంచే ప్లాన్ చేసుకున్నా.. కాగా చికాగో చుట్టుపక్కల ఏదైనా యూనివర్సిటీలో ఉందామనుకున్నా. అమెరికాలో టాప్ ఇంజనీరింగ్ కళాశాలలకు అప్లై చేస్తే సీటు కూడా దొరికింది. ఇక చికాగో వెళ్లిపోయాక ఇద్దరం కలిసుండొచ్చు.. మా ప్రేమకు అడ్డుచెప్పేవారే ఉండర‌ని భావించా. అయితే అక్కడికి వెళ్ళాక వ్యవహారం రివర్స్ అయింది. నా హార్ట్ బ్రేక్ అయింది. ఆ బ్రేకప్‌ బాధ నుంచి బయటపడడానికి నాకు 4, 5 ఏళ్ల పట్టింది. తనను ఎంతో నిజాయితీగా ప్రేమించా.. కాని వర్కౌట్ కాలేదు.. లవ్ ఫెయిల్ కావడంతో చాలా బాధను అనుభవించా అంటూ వివరించాడు ఆనంద్ దేవరకొండ.