‘ వ్యూహం ‘ సినిమా రిలీజ్ డేట్ కు చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో తెలుసా.. దిమ్మ తిరిగే మ్యాటర్ రివీల్ చేసిన ఆర్జీవి..

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్లతో దుమారాన్ని రేపి పలు వివాదాలకు దారితీసింది. దీంతో రెండు నెలల క్రితమే సినిమాకు సెన్సార్ పూర్తయిన.. రిలీజ్ ఆపాలని తెలుగు దేశం కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంట్లో వ్యూహం సినిమా సెన్సార్.. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ రద్దు చేయగా.. మరోసారి ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ విచారణ జరిపిన బెంచ్.. ఈ సినిమాకి మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డు కు తెలిపింది.

మళ్లీ సినిమా వీక్షించిన సెన్సార్ బోర్డ్ స‌భ్యులు యూ సర్టిఫికేషన్ ఇవ్వడంతో.. వ్యూహం సినిమా రిలీజ్ గురించి సినిమాను ఫిబ్రవరి 23 రిలీజ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించారు. తాజాగా ఈ రిలీజ్ డేట్ కు చంద్రబాబుకు ఉన్న లింక్ ఇదే అంటూ ఆర్జీవి ఓ ట్బిట్ చేశాడు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతుంది. సిబిఎన్ లక్కీ నెంబర్ 23 అంటూ ఆయన వివరించాడు.

1.వైసిపి పార్టీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యే సీట్లు 23.
2. 2019 ఎలక్షన్ల తరువాత తాను ఓడిపోయానని తెలుసుకున్న రోజు 23.
3. బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23.
4. బాబు అరెస్ట్ అయిన తేదీ 9 – 9 – 23.


5. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023లో సెప్టెంబర్ 23 వరకు జ్యూడిషన్ రిమాండ్ ఇచ్చిన సిబిఐ కోర్టు బాబు ఫ్రీజన్‌ నెంబర్ 7691.. వీటన్నిటిని కొడితే వచ్చే నెంబర్ 23.
6. చంద్రబాబు, ఎన్టీఆర్ దగ్గర నుంచి తను లాకున్నా పార్టీకి వారసుడిగా చేద్దాం అనుకుంటున్నా లోకేష్ పుట్టినరోజు 23.
7. వ్యూహం సినిమా జగ గర్జన ఈవెంట్ 23. వ్యూహం సినిమా రిలీజ్ 23 అంటూ వివరించాడు.