సాయి పల్లవి అభిమానులకు గుండెలు పగిలే న్యూస్.. క‌ల‌లో కూడా ఊహించని ట్విస్ట్ ఇదే..

అక్కినేని నాగచైతన్య హీరోగా.. చందు మండేటి డైరెక్షన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ తండేల్‌. డిఫరెంట్ జాన‌ర్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో ఆమె న్యాచురల్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ చివరలో చనిపోతుందని న్యూస్ ఇప్పుడు తెగ చెక్కర్లు కొడుతుంది. దీంతో సాయి పల్లవి అభిమానులకు గుండెప‌గిలిన‌ట్లైంది.

ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. ఆమె చనిపోతే సినిమా సక్సెస్ అవ్వదు అంటూ డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇప్పటికే డైరెక్టర్ చందు మొండేటికి ఇలాంటి మెసేజ్లు చాలా వచ్చినట్లు తెలుస్తుంది.