బిగ్ బ్రేకింగ్: ఊహించని చిక్కుల్లో మహేశ్ బాబు కూతురు సితార ..అసలు ఏమైందంటే..?

సితార ఘట్టమనేని .. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూతురుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రి సూపర్ స్టార్ హీరో .. తల్లి ఒకప్పటి హీరోయిన్ తాత పెద్ద సూపర్ స్టార్ ఇలా బ్యాక్ గ్రౌండ్ బాగా ఉండడంతో సితారకు మంచి క్రేజీ పబ్లిసిటీ లభించింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సితార అభిమానులతో ముచ్చటిస్తూ కూడా ఉంటుంది . తండ్రికి మించిన రేంజ్ లో చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది .

అయితే సితార ఘట్టమనేని పేరుని ఫోటోలని ఉపయోగించి కొందరు డబ్బుల కోసం నేరాలకు పాల్పడుతున్నారు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఘట్టమనేని సితార పేరుతో కొన్ని ట్రేడింగ్ పెట్టుబడి లింకులను పంపుతూ డబ్బులు దోచేస్తున్నారు అని .. ప్రజల అప్రమత్తంగా ఉండాలి అని .. ఎలాంటి అనుమానస్పదంగా అనిపించిన తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలి అని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు .

అయితే కొంతమంది ఇది తెలియక సితార ఘట్టమనేని పై పోలీసులు కేసు పెట్టారు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి సితార ఘట్టమనేని తప్పు ఏమీ లేదు ఆమె మంచితనాన్ని ఉపయోగించుకొని కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేయడానికి ఇలా చేస్తున్నారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . నమ్రత శిరోద్కర్ సైతం అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసింది..!!