వావ్: బాలయ్య ని ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోతున్న ఆ దమ్మున్న దర్శకుడు.. మరో సమరసింహా రెడ్డి పక్కా..రాసిపెట్టుకోండి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే అఖండ 2 ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు బాలయ్య . అయితే అఖండ 2 తర్వాత బాలయ్య క్రేజీ డైరెక్టర్ కి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

బాలయ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే దమ్మున్న డైరెక్టర్ హారీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఎంతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతుందట . ఈ సినిమాలో బాలయ్య చాలా నాటి లుక్స్ లో కనిపించబోతున్నాడట . అంతేకాదు అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి సినిమాలు బాలయ్యకు ఎలాంటి హిట్ అందించాయో ఈ సినిమా కూడా అందిస్తుంది అంటూ హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారట.

 

దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. బాలయ్యను డిఫరెంట్ లుక్ లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ బాలయ్య ఒకపక్క సినిమాలు మరొక పక్క రాజకీయాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు . అంతేకాదు త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చూద్దాం మరి బాలయ్య కొడుకు ఇండస్ట్రీలో ఎలా సెటిల్ కాబోతున్నాడో..?