వాట్: ‘ దేవర ‘లో జాన్వి కపూర్ మెయిన్ హీరోయిన్ కాదా.. అసలు హీరోయిన్ వేరే ఉందా..?!

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఊర మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సముద్ర తీర నేపద్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత తెర‌కెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట.

తన ఏరియాలో భయం అంటే తెలియని వారికి భయాన్ని పుట్టించే పాత్రలు ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట.. తారక్ జోడిగా ఇద్దరు కనిపిస్తారు అంటూ తెలుస్తుంది. అక్కడ ఓ ట్విస్ట్ ఉందట. ఎన్టీఆర్ ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారని.. చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దేవరలో తారక్ ద్విపాత్రాభినయం చేయడంపై మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులు గా కనిపించబోతున్నాడట. కొడుకు ఎన్టీఆర్ కి జాన్వి కపూర్ హీరోయిన్ అలాగే.. తండ్రి ఎన్టీఆర్ కి కూడా ఓ పేరు ఉందట. ఆమె ఓ కొత్త హీరోయిన్ అని తెలుస్తుంది. మరాఠీ కి చెందిన ఓ యాక్టర్ ను ఇందులో కొరటాల శివ ఎన్టీఆర్ జంటగా సెలెక్ట్ చేసాడట. ఆమె పేరు శృతి మరాఠీ. ఆమె మరాఠీలో పలు సినిమాల్లో నటించింది. ఇటీవల కాలంలో పాపులర్ గా మారుతున్న ఈ ముద్దుగుమ్మ.. తండ్రి ఎన్టీఆర్ పాత్రకి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది.

అయితే కథపరంగా తండ్రి ఎన్టీఆర్ రోలే చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందట. అతనే స్వయంగా ఓ ఓడరేవుని నిర్మించి.. తన ఓడరేవు బెస్ట్ గా ఉండాలని ప్రయత్నిస్తాడట. ప్రత్యర్థులు కుట్రలు చేసి ఎన్టీఆర్ ని చంపేస్తారని.. తండ్రి నిర్మించిన ఓడరేవును విలన్ల నుంచి తన సొంతం చేసుకోవడానికి కొడుకు ఎన్టీఆర్ చేసే పోరాటమే సినిమా అని తెలుస్తుంది. ఇక తండ్రి పాత్ర మెయిన్ గా ఉంటే ఆయన జోడి కూడా అంతే మెయిన్ గా ఉంటుంది. దీంతో జాన్వి కంటే మరాఠీ నటి పాత్ర కీలకంగా ఉండబోతుందని టాక్.