మరో 10 నెలల్లో మెగా ఇంట్లో వారసుడు.. వేణు స్వామి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ వైరల్..

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వైరల్ అయిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ వేణు స్వామి తెలుగు సిని ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ పాపులర్ అయ్యాడు. అలాగే టాలీవుడ్ సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు ఇత‌న్ని బాగా నమ్ముతారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు సైతం వేణు స్వామి అంటే తెలుస్తుంది. ఇక ఈ వేణు స్వామి సెలబ్రిటీల గురించి చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో నిజం కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. దానికి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య – సమంతల విడాకులే కారణం. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకుంటారు అంటూ వేణు స్వామి మొదటలో చెప్పుకొచ్చాడు.

అయితే వేణు స్వామి ఇలా చెప్పడంతో అభిమానులంతా ఆయన పై ఫైర్ అయ్యారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత ఇదే నిజమైంది. దీంతో వేణు స్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రెటీలపై వేణు స్వామి జాతకాలు చెబుతూ ట్రెండ్ అవుతున్నాడు. కొంతమంది సెలబ్రిటీస్ వేణు స్వామి దగ్గరకు వెళ్లి మరి జాతకాలు చూపించుకుని ప్రత్యేక పూజలు చేపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు జాతకాలు విఫ‌లం అవడంతో వేణు స్వామి పై సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. అయినా వేణు స్వామి ఏమాత్రం తగ్గలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు కూడా ఇప్పటికే వేణు స్వామిని సంప్రదిస్తూ ఉంటారు.

ఇటీవల కాలంలో వేణు స్వామి పలు టీవీ షోలలో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలా వేణు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యూస్ ఛానల్ లో ఎవరో సెలబ్రిటీ గురించి ఖచ్చితంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మెగాస్టార్ ఫ్యామిలీ గురించి చేసిన‌ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. మెగా ఫ్యామిలీలో మరో 10 నెలల్లో వారసుడు రాబోతున్నాడు అంటూ వివరించాడు. అది కూడా రామ్ చరణ్ – ఉపాసన జంటకు వారసుడు పుట్టబోతున్నాడు అంటూ చెప్పాడు. దీంతో మెగా అభిమానులంతా వేణు స్వామి చెప్పినది నిజం కావాలని.. నిజంగానే ఆ ఇంటికి ఓ వారసుడు పుట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.