బాడీ షేమింగ్ పై మొదటిసారి నోరు విప్పిన మృణాల్.. అలాంటి కామెంట్స్ చేశారంటూ..

సీతారామ‌మ్‌ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌ ఠాగూర్. మొదటి సినిమాతోనే తన కట్టు,బొట్టు, సాంప్రదాయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. సినిమా హిట్ కావడంతో వరుస‌ ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల నాని హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఇలా టాలీవుడ్ లో మృణాల్‌ నటించిన సినిమాలు అన్ని సక్సెస్ సాధిస్తున్నాయి. కాగా ప్రస్తుతం మృణాల్‌.. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్‌ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి.. బాడీ షేమింగ్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అవేంటో ఒకసారి చూద్దాం. మొదట బాలీవుడ్ లో నట్టించిన‌ ఈ ముద్దుగుమ్మ అక్కడ నటించే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించింది. నాకు నటించేందుకు అవకాశాలు వచ్చినా మరొకరితో పోలుస్తూ మీరు వారిలా చేయలేదు అంటూ ఇన్సల్ట్‌ చేసే వారిని.. అందుకే నేను అక్కడ స్థిరపడాలనుకోలేదంటూ వివరించింది. అంతేకాదు తనకు తల్లి, సోదరి లాంటి పాత్రలు చేసేందుకు కూడా భయం లేదని వివరించింది.

గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు.. తన బాడీని ఉద్దేశించి పలువురు కామెంట్స్ చేశారని.. చెప్పుకొచ్చింది మృణాల్‌. మీరు అసలు సెక్సీగా లేరు.. మీరు చేసిన పాత్ర సెక్సీగా ఉందని.. మీరు ఆ పాత్రకు అంత దగ్గరగా కనిపించలేదని దారుణంగా మాట్లాడారంటూ వివరించింది. ఓ ఫోటోగ్రాఫర్ నా పాత్రను చూడకుండానే మరాఠీలో మాట్లాడుతూ ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు అంటూ కామెంట్స్ చేశాడని వివరించింది. కానీ ఆ తర్వాత అతను నాకు క్షమాపణలు చెప్పాడంటూ చెప్పుకొచ్చింది. ఇక నేను ఏదైనా ప్రాజెక్టులో నటిస్తే ఆ పాత్రలో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా.. అప్పుడే ఆ రోల్‌ నేను సులభంగా చేయగలుగుతా అంటూ వివరించింది.

ఓ సాంగ్ చేసేటప్పుడు కొందరైతే ఏకంగా నువ్వు బరువు తగ్గితే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చారట. దానికి బదులిస్తూ నా బాడీ వెయిట్ నాకేమీ ఇబ్బంది కల్పించడం లేదు.. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటూ కాస్త గట్టిగానే ఇచ్చి పడేసారంటూ వివరించింది. ఈ విధంగా బాలీవుడ్ లో ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్స్ ని మృణాల్‌ ఎదుర్కొందట. దీంతో ఆమెకు బాలీవుడ్ పై ఆసక్తి పోయిందంటూ చెప్పుకొచ్చింది.