ఎన్టీఆర్ కు ఆ స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసా.. గ్రౌండ్ లో దిగితే గూస్ బంప్సే..

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ హీరోలలో మొదటి వరుసలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందే విదేశాల్లో ఎన్టీఆర్‌కు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఆర్ఆర్ఆర్ తో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ త్రిబుల్ అయింది. ఎన్టీఆర్ నటన గురించి చాలామందికి తెలుసు. అయితే ఆయనలో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎన్టీఆర్‌కు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట. అందులోను బ్యాడ్మింటన్ ఆడితే గ్రౌండ్ దద్ద‌రిలాల్సిందే అంటూ తెలుస్తుంది. బ్యాడ్మింటన్ లో ఎన్టీఆర్ ప్రొఫెషనల్ ప్లేయర్. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో వివరించాడు. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు కూడా తారక్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.

Devara new poster out: Jr NTR is king of the sea in his next | Telugu News  - The Indian Express

ఎన్టీఆర్ ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ అని.. ఆయన బ్యాడ్మింటన్‌లో డబుల్స్ ఇక్కువ ఆడేవారని.. ఆయన ఆట చూడడానికి చాలామంది జనం క్యూ కట్టేవారు.. అంతేకాదు బ్యాడ్మింటన్ ఆడేటైమ్‌లో ఎన్టీఆర్ గూస్‌బంప్స్ తెప్పించేలా తొడగొట్టేవాడు అంటూ సుధీర్ బాబు వివరించాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలామంది ఎన్టీఆర్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. నటనే కాకుండా ఆటల్లోనూ ఈ రేంజ్ లో సక్సెస్ సాధించాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబోలో దేవర సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.