శివాజీ డాట‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న యావ‌ర్‌.. త‌మ్ముడనుకుంటే అల్లుడ‌య్యేలా ఉన్నాడే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని స్పై బ్యాచ్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రిన్స్ యావ‌ర్, శివాజీ, ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకున్నారు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలకు గట్టిగా పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచారు. ఇక ప్రశాంత్, యావర్ ఇద్దరినీ శివాజీ సొంత తమ్ముడుళ్లా భావించాడు. అదే స్థాయిలో యావ‌ర్‌, ప్రశాంత్ అత‌న్ని గౌరవిస్తూ వచ్చారు.

మేడ‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో యావ‌ర్ రొమాన్స్... అడ్డంగా దొరికిపోయారుగా..! | yavar romance with nayani pavani

శివాజీ టాస్క్ లో గాయపడినప్పుడు స‌హాయం చేశారు. అయితే ఈ సీజన్ చివరికి వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ విన్నర్ కప్ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన యావ‌ర్‌, శివాజీ, ప్రశాంత్ ప్రతిరోజు కలుసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. అయితే పలు టీవీ షోస్ లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే మరో కంటెస్టింట్ గా ఐదో వారం మైల్ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన్న నయని పావని.. హౌస్ లో ఉన్నది ఒక్క వారమే అయిన హౌస్‌లో అందరికీ చాలా దగ్గర అయిపోయింది. ముఖ్యంగా శివాజీ.. నాయనని బిడ్డ అని పిలిచేవాడు. అయితే నయని, ప్రిన్స్ ఇద్దరు కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేస్తున్నారు.

Prince Yawar And Nayani Pavani Super Mass Dance 🔥💥 | #kurchimadathapetti Song 🔥 | Guntur Kaaram - YouTube

ఈ పాట యూట్యూబ్లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని అంతా భావిస్తున్నారు. క్రమంగా నయని యావర్‌ సాంగ్ ప్రమోషన్స్ కోసం రొమాంటిక్ పిక్స్ దిగుతూ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసుకున్నారు. అలాగే పలు సాంగ్స్‌కు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫొటోస్ చూసిన వారంతా శివాజీని భయ్యా భయ్యా అంటూ శివాజీ బిడ్డ నాయిని పావనితోనే రొమాన్స్ చేస్తున్నవ్ ఏంటి బ్రో అంటూ.. శివాజీ చూస్తే రేయ్ తమ్ముడు అనుకుంటే నాకు అల్లుడయ్యేట్టు ఉన్నావే అంటాడంటూ.. వ‌రుస‌లు మారిపోతాయి యావ‌ర్ చూసుకో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sai Pavani Raju (@nayani_pavani)