మిస్ ఇండియా కాంపిటీషన్ ఓ పెద్ద మాఫియా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

యాక్ట్ర‌స్‌ కామాక్షి భాస్కర్.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మా ఊరి పొలిమేరా సినిమా. ఈ సినిమా కంటే ముందు ఈమె ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సినిమాతో ఈమెకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. అయితే కామాక్షి మొదట ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కబుల్ హై, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తాజాగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమాతో ఈమెకు భారీ పాపులారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది కామాక్షి.

ఆ ఇంటర్వ్యూలో కామాక్షి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. చెనైలో ఎంబిబిఎస్ చేసి అపోలో హాస్పిటల్లో కొంతకాలం డాక్టర్ గా వర్క్ చేసిన కామాక్షి.. ఆ తర్వాత మోడల్ రంగంలోకి అడుగుపెట్టి 2018 ఏడాదిలో మిస్ తెలంగాణగా ఎంపికయింది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు చేరుకున్న ఈ ముద్దుగుమ్మ.. వైద్యరంగంలో నుంచి మోడల్ రంగంలోకి అడుగుపెట్టడానికి కారణం ఏంటో వివరించింది. ఓ వైద్యురాలిగా తాను ఏది చెప్పినా తను ఏదైనా మంచి చేయాలనుకున్న.. తను చెప్పింది వినాలంటే తను ఓ స్టార్ సెలబ్రెటీ కావాలని మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని వివ‌రించింది.

అలాగే ఏమీ తెలియకపోయినా యూట్యూబ్లో పలు వీడియోలు, ఇంటర్వ్యూలు చూస్తూ మోడలింగ్ పై ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి ఆమె ఎంత కష్టపడిందో వివరించింది. మోడల్గా చేస్తానని చెబితే డాడీ డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పారని.. ఇంత కష్టపడి చదివిస్తే నువ్వు మరేదో చేస్తానని అంటావు అంటూ ఒప్పుకోలేదని వివరించింది. దాంతో తనే ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ చేస్తూ మోడలింగ్ చేయాలని పట్టుదలతో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంతో కష్టపడేదాన్ని చెప్పుకొచ్చింది. అయితే అంత కష్టపడినా తను మిస్ ఇండియా ఫైనల్ కు చేరుకున్న సమయంలో టాప్ 3 గానే నిలిచాను అని వివరించింది.

 

ఇక టాప్ వన్ లోకి వచ్చేందుకు నువ్వు ఇంకా చాలా సన్నబడాలి అంటూ ఓ జడ్జి చెప్పిందని వివరించింది. తనకు ఆమె చేసిన కామెంట్స్ అసలు నచ్చలేదని.. నిజానికి నా హైట్ కు నా వైట్ కరెక్ట్ అని ఇతర దేశాల వాళ్ళతో నా బాడీ మ్యాచ్ కాదని వివరించింది. ఇక జడ్జ్ అలా చెప్పగానే నాకు ఆ ఫీల్డ్ పై ఉన్న ఆసక్తి పోయిందని.. అదో పెద్ద మాఫియాలా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. బ్యూటీ అంటే మనసులో అందాన్ని పెంచుకోవాలి.. సర్జరీలతో హెల్త్ పాడు చేసుకుని ఆ అందాన్ని రెట్టింపు చేసుకోవడం నాకు నచ్చదు అంటూ మీనాక్షి వివరించింది. అయితే మిస్ ఇండియా కాంటెస్ట్ పై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.