మత్తు కళ్ళతో మ్యాజిక్ చేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ అయినా ఫోటో పెట్టిన కొద్ది క్షణాల్లోనే తమ ఫేవరెట్ సెలబ్రిటీ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలానే తాజాగా ఓ సూపర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మత్తు కళ్ళతో చూస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోడల్ బ్యూటీగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పల్లెటూరి పిల్ల పాత్రలో వావ్ అనిపిస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేర్ చేస్తుంది.

ఈమె హీరోయిన్ కాదు.. బాక్సర్ కూడా. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఎస్.. ఆమె రితికా సింగ్. వెంకటేష్ గురూ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ముంబైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. తన తండ్రి శిక్షణతో ఆరితేరి సూపర్ ఫైట్లీ ఫస్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేయగా.. అక్కడ దర్శకరాలు సుధా కొంగర ఆమె సినిమా కోసం నిజమైన బాక్సర్ ను వెతికే ప్రయత్నంలో ఉంది. కాగా ఆమెకు రితికా సింగ్ కనబడింది. ఈమె అందం కూడా ఆకట్టుకోవడంతో రితికాతో సాలా ఖదూస్ ఇరుది సుట్రు.. అనే సినిమాను తెరకెక్కించింది.

తమిళ్, హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ మూవీ ని తెలుగులో గురూ పేరుతో రీమిక్స్ చేశారు. ఇందులో కూడా రితికా సింగ్‌ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్టర్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో నీవెవ‌రో సినిమాలో మాత్రమే నటించింది. ప్రస్తుతం తమిళ్లో తలైవార్ 170 సినిమాలో ఈమె నటిస్తోంది. ఇక అందంతో పాటు నటనలో కూడా టాలెంట్ ఉన్న రితిక సింగ్ కు టాలీవుడ్ లో అవకాశాలు దక్కడం లేదు.