“ఆ హీరో దయతోనే చిరంజీవికి పద్మవిభూషణ్”.. సంచలన విషయాని బయట పెట్టిన నట్టికుమార్ ..!!

మనకు తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం వేల కేంద్రం పద్మా అవార్డుల ప్రకటించి.. ఆ లిస్టులో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది అన్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొంతమంది చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల హ్యాపీగా ఫీల్ అవుతుంటే ..మరి కొంతమంది కుళ్ళుకొని చచ్చిపోతున్నారు . అయితే కొంతమంది కావాలని చిరంజీవిపై బురద జల్లుతున్నారు . రీసెంట్గా ప్రముఖ నిర్మాత నెట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఎలక్షన్స్ టైం లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోసమే ఇలా చేసి ఉండొచ్చు అంటూ మాట్లాడారు . ప్రజెంట్ ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయ్.

చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషమని ..అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఆయనకు రావడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని చెప్పుకు వచ్చారు. అయితే చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం వెనక మోదీ అమిత్ షా రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ వల్లే ఆయనకు ఈ అవార్డు వచ్చింది అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చారు. కాపుల సపోర్ట్ దొరుకుతుందని బిజెపి ఇలా పవన్ కళ్యాణ్ అన్నగారైన చిరంజీవికి అవార్డు ఇచ్చుంటారు అనే విధంగా మాట్లాడారు. దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!