విజయ్ దేవరకొండ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ క్రేజీ డేనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్లు ఫ్లాప్‌లు సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది.

ఇక ఇప్పటికే పరిసరాం, విజయ్ దేవరకొండ కాంబోలో గీతాగోవిందం మూవీ వచ్చి బ్లాక్ బ‌స్టర్ కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించ‌గా.. షూటింగ్ పూర్తికాక పోవడంతో సినిమా వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను ఓ క్రేజీ డేట్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని మేకర్స్‌ ప్రకటించగా ఏవో కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రేజీ డేట్‌న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 29 నాటికి పూర్తవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా మిగతా కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ఇప్పటికే మేకర్స్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.