బాలయ్య సినిమాల్లోకి రాకముందు ఏం పని చేసేవాడో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు నటవార‌సుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. పదహారేళ్ళ వయసులోనే బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆయనకు ఇంత డిసిప్లిన్, నటనలో చాతుర్యం వచ్చాయంటే అది కేవలం తండ్రి ఎన్టీఆర్‌నుంచే అని చెప్పుకోవచ్చు. కాగా బాలయ్య‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయంలో మొదట సీనియర్ ఎన్టీఆర్ తోనే ఎన్నో సినిమాల్లో కలిసి నటించాడు.

తర్వాత సోలో హీరోగా నటిస్తూ స్టార్‌డంను సంపాదించుకున్నాడు. అయితే ఎన్టీఆర్, బాలకృష్ణ మల్టీ స్టార‌ర్‌గా తెరకెక్కిన సినిమాలలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర కూడా ఒకటి. ఇందులో టైటిల్ రోల్‌ ఎన్టీఆర్ పోషించగా.. వీరబ్రహ్మేంద్రస్వామి అమరభక్తుడిగా సిద్ధప్ప పాత్రను బాలయ్య పోషించారు. ఈ సినిమా అప్పట్లోనే నాలుగు కోట్ల కలెక్షన్లను రాబట్టి భారీ రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు కూడా స్వయంగా ఎన్టీఆర్ వహించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే సినిమా అంతకుముందే ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.. సెన్సార్ అభ్యంతరాలతో సినిమా రిలీజ్ కావడం ఆలస్యమైంది.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత సెన్సార్ వారి నుంచి పర్మిషన్ తీసుకొని.. ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే సమయంలోనే.. బాలయ్యకు కూడా కొన్ని దర్శకత్వ మేలుకోవలు నేర్పించారట. అలాగే స్వయంగా బాలయ్యే సినిమాలో కొన్ని కెమెరా షాట్స్ తెర‌కెక్కించార‌ని అని తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బాలయ్య కెమెరా మ్యాన్‌గా వ్యవహరించిన ఒకే ఒక్క సినిమా ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా కావడం విశేషం.