బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్.. జగన్ కి ఈ విధంగా కలిసొస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ తన తాత గారి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వెళ్ళాడు . చాలా వినమ్రుడై తాత గారి సమాధి వద్ద పూలు వేసి నివాళులర్పించాడు. అంతేకాదు సైలెంట్ గా ఏం మాట్లాడకుండానే బయటకు వచ్చేసాడు . అయితే ఆయన వెళ్లిన కొన్ని నిమిషాలకు నందమూరి బాలకృష్ణ గారు కూడా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించాడు.

అయితే బాలకృష్ణ అక్కడ నుంచి వెళ్లి వెళ్లిపోగానే ఎన్టీఆర్ – కళ్యాణ్రామ్ ఉన్న ఫ్లెక్సీలను తొలగించేశారు అక్కడ ఉండే జనాలు . అంతకుముందు బాలకృష్ణ అక్కడ ఉండే వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. బాలకృష్ణ చెప్తేనే వాళ్ళు అలా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఉన్న ఫోటోలను తొలగించేశారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ సీరియస్ అయిపోయారు .

బహిరంగంగా లేక కూడా రిలీజ్ చేశారు . ఎన్టీఆర్ జోలికి వస్తే తాడోపేడో తేల్చుకుంటామంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేశారు . అయితే ఇప్పుడు ఇదే వివాదం జగన్మోహన్ రెడ్డికి కలిసొస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో ఎన్టీఆర్ ని తక్కువ చేస్తే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టిడిపికి నెగిటివ్గా మారుతారని ..అదే మూమెంట్లో జగన్ కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూల్ చేస్తే జగన్ కి ఆ ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు. దీంతో ఇదే ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏపీ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించబోతుంది ఈ ఇష్యూ అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!