బాలకృష్ణ యాక్షన్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ రియాక్షన్.. దెబ్బ మామూలుగా లేదుగా..!

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలను కూడా ఎంత పెద్దగా చేసి రాద్ధాంతం చేసి చూస్తారో మనకు తెలిసిందే . అయితే ప్రాణం కంటే ఎక్కువగా భావించే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు తీసేయమంటే ఎవరికి కోపం రాదు చెప్పండి . బాలకృష్ణ అన్నాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ – హరికృష్ణ -ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ పేర్లతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయమంటూ బాలకృష్ణ చెప్పారు అని ఓ వీడియో వైరల్ అవుతుంది.

దీనిపట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. అంతేకాదు స్ట్రైట్ గా బహిరంగంగా ఓ లేఖను కూడా రిలీజ్ చేశారు . ఇన్నాళ్లు జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూసిన ఆయన మంచితనం చూసి మేము వదిలేశామని .. ఇకపై అలా వదలబోమని హెచ్చరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమి తప్పు చేశారు అని ఇలా ఆయనను దూరం పెడుతున్నారు అని నిలదీస్తున్నారు.

అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అడ్డ ఏపీ అని.. మిగతా వాళ్ళను మడత పెట్టేస్తామంటూ స్ట్రైట్ గా హెచ్చరిస్తున్నారు . అంతేకాదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ పై నందమూరి అభిమానులు సీరియ్స్ అవుతున్నారు . అంతేకాదు సోషల్ మీడియాలో ఈ వివాదం ఇప్పుడు పెద్ద దుమారంగా మారిపోయింది. దీంతో కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి..!!