ఈసారి OSCAR బరిలో నిలిచిన 12 ఇండియన్ సినిమాలు ఇవే.. ఏకైక తెలుగు మూవీ ఏంటో తెలుసా..?

ఆస్కార్ ..ఈ పేరు చెబుతూ ఉంటేనే తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ప్రతి ఒక్క సినీ నటీనటులలో తెలియని పులకింపు వస్తూ ఉంటుంది. కెరీర్లో ఒక్కసారి అయినా సరే ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఏ నటీనటులకు ఉండదు చెప్పండి . సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ కూడా ఒకటి. కోట్లాదిమంది సినీ ఫ్యాన్స్ ఈ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్న మన ఇండియాకి రాని ఆస్కార్ 2023లో నాటు నాటు పాటకు గాను ఆస్కార్ వరించింది.

ఇప్పటికీ ఆ మూమెంట్స్ ని ఆ అచీవ్మెంట్ ని మర్చిపోలేకపోతున్నారు ఇండియన్ అభిమానులు. కాగా 2024 కి సంబంధించి ఆస్కార్ నామినేషన్ లిస్ట్ రిలీజ్ అయింది. 2024లో మన భారతదేశం తరపున ఏకంగా 12 సినిమాలు నామినేట్ అయ్యాయి . వాటిల్లో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉండడం గమనార్హం. అది కూడా మన న్యాచురల్ స్టార్ హీరో నాని నటించిన సినిమా కావడం మరింతగా ఫ్యాన్స్ సంబరపడిపోయేలా చేస్తుంది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం ఎంపిక చేయబడిన చిత్రాలు వివరాలు ఏంటో ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!

1)ది స్టోరీ టెల్లర్ (హిందీ),
2) సంగీత పాఠశాల ( హిందీ),
3) శ్రీమతి చటర్జీ -నార్వే (హిందీ),
4) డంకి (హిందీ).
5) 12 ఫెయిల్ (హిందీ),
6) విడతలై పార్ట్ వన్ (తమిళం),
7) ఘూమర్ ( హిందీ),
8) దసరా (తెలుగు),
9) హిందీ రాఖీ రాణి కి ప్రేమ్ కహాని (హిందీ),
10) కేరళ కథ (హిందీ)
11) 2018 (మలయాళం)
12) జిగ్వాటో (హింది).. ఈ సినిమాలు 2024సంవత్సరానికి గాను ఆస్కార్ నామినేషన్ లో నామినేట్ అయ్యాయి..!!