” ప్రేమలో ఉన్న ” అంటూ ఎట్టకేలకు అసలు గుట్టు బయటపెట్టిన తాప్సి.. ఈమె ఫియాన్స్ ఎవరంటే..!

హీరోయిన్ తాప్సి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఒకనక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. డెన్మార్క్ బ్యాట్మెంటన్ ఆటగాడు మాథిస్ బో తో తాప్సి రామాయణం గురించి ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

కానీ ఎప్పుడూ ఈ ముద్దుగుమ్మ ఈ వార్తలపై స్పందించలేదు. ఇక తాజాగా ఈ విషయంపై ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది. ” దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ తో ప్రేమలో ఉన్నాను. దక్షిణాది నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతను పరిచయం అయ్యాడు. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింత బలపడింది.

కానీ మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మాథిస్ తో నేను చాలా సంతోషంగా ఉన్నా. బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగు పెట్టాలని ఆలోచన ఏ రోజు రాలేదు ” అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసింది తాప్సి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.