టీం ” విశ్వంభర ” కి స్పెషల్ విషెస్ తెలియజేసిన ఆ స్టార్ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ” విశ్వంభర “. ఈ సినిమాపై చిరు అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను కాన్సెప్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది.

ఈ వీడియోకి ఆడియన్స్ నుంచి.. ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ కాన్సెప్ట్ వీడియో పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ” కాన్సెప్ట్ వీడియో ను వీక్షించాను. అంతే కాదు నాకు ఆ వీడియో ఆసక్తికరంగా అనిపించింది.

యంగ్ డైరెక్టర్ విశిష్ఠ, యూవీ క్రియేషన్స్, మెగాస్టార్ చిరంజీవి మరియు ఎం ఎం కీరవాణి గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్న. ఇక ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ” అంటూ ట్వీట్ ద్వారా స్పందించాడు చెర్రీ. ప్రస్తుతం చరణ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ జనవరి నెలలో ఆడియన్స్ ముందుకు రానుంది.