ఆ ఏరియాలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ” హనుమాన్ “.. వాడిని ఎవరైనా ఆపండ్రా బాబు..!

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ రాబడుతుంది హనుమాన్. ఇక గుంటూరు కారానికి పోటీగా ఈనెల 12న రిలీజ్ అయిన ఈ మూవీ మహేష్ ని తలదన్ని టాప్ పొజిషన్లో నిలబడింది.

ఇక ప్రస్తుతం ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ నార్త్ అమెరికా లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎస్ లో హనుమాన్ మూవీ ఎప్పటి వరకు 4 మిలియన్ డాలర్ల కి పైగా వసూలు రాబట్టింది. ఇది పెద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు.

దీంతో తెలుగు టాప్ 5 గ్రోసెస్ లో అక్కడ హనుమాన్ మూవీ నిలిచింది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.