మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక విభూషణ్.. ఎందుకో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్ లని చూసిన చిరు 2023లో మాత్రం భారీ అపజయాలను చూశాడు. అయినా ఏమాత్రం కృంగిపోకుండా తన సత్తా చాటుకుంటూ ” విశ్వంభర ” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక నటుడుగా ఎంతో గొప్ప సొంతం చేసుకోవడంతో పాటు అటుపలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు చిరు. ఇక చిరంజీవికి 2006లో మన భారత్ ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ బిరుదు లభించిన సంగతి తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈయనని పౌర పురస్కారాల్లో భాగంగా పద్మ విభూషణ్ తో మనం ప్రభుత్వం సత్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై సోషల్ మీడియాలో.. టాలీవుడ్ వర్గాలలో బాగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.