చెర్రీ ” గేమ్ చేంజర్ ” మూవీ పై దిమ్మ తిరిగే అప్డేట్..!

రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి పాన్ ఇండియా హీరో అయిపోయాడు చెర్రీ. ఇక తాజాగా చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ” గేమ్ ఛేంజర్ “.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, అంజలి, ఎస్ జై సూర్య, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం సర్వేగంగా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతి లేదా అక్టోబర్ 12న దసరా సందర్భంగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మేకర్స్ మార్చి కాల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తుంది. కాగా ఈ పొలిటికల్ యాక్షన్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని దర్శకుడు శంకర్ భరోసా ఇస్తున్నారు. మరి ఏం జరుగుద్దో చూడాలి.