చిట్ట చివరకు తన సినిమాలో మహేష్ రోల్ ఏంటో బయటపెట్టిన రాజమౌళి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అనగానే ఠ‌క్కన గుర్తుకు వచ్చేది రాజమౌళినే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రాజమౌళిని కొట్టే డైరెక్టర్ మరొకరు కనిపించడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసిన ఒక్క సినిమా మీద పిచ్చి ఉన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాని చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క సినిమాలో.. ప్రతి ఒక్క షాట్ లో తన పర్ఫెక్షన్ చూపిస్తూనే ఉంటాడు జక్కన. ఓ సినిమా తీస్తున్నాడు అంటే దానిమీద తన పూర్తి ఎఫెక్ట్ అంతా పెట్టేస్తాడు.

SS Rajamouli compares next film with Mahesh Babu to James Bond, Indiana  Jones - Hindustan Times

దీంతో ఆయన తెర‌కెక్కించే అన్ని సినిమాలు సాధారణ ప్రేక్షకులతో పాటు.. సినీప్రియుల వరకు అందరికీ విపరీతంగా నచ్చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ సాధించాయి. ఇక ప్రస్తుతం `మహేష్ బాబు తో మరో పాన్ ఇండియా సినిమా చేసేందుకు జక్కన్న సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకైనా రాకముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రాజమౌళి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తెర‌కెక్కిస్తాడో లేదో చూడాలి.

No photo description available.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు చాలా రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాల్లో ఓ హిప్పీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. హిప్పి అంటే దేశదిమ్మర్లు. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉండేవారినే హిప్పీ అంటారు. ఇలా తను తిరుగుతున్న ఏరియాల్లో కొన్ని ప్రదేశాల్లో జనాలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టి మరో ప్రదేశానికి వెళ్ళిపోయే వ్యక్తిగా మ‌హేష్‌ కనిపిస్తాడని టాక్. ఇక ఈ సినిమాలో హిప్పీ క్యారెక్టర్ అంటే మహేష్ బాబుకు కాస్త కొత్తగానే ఉంటుంది. ఈ క్యారెక్టర్ తో తను ఎంత మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో వేచి చూడాలి.