అయోధ్యలో మాత్రమే రాముడు ఉంటాడా..? కరోనా కంటే భయంకరమైనవి విజృంభిస్తాయి.. శివాజీ కాంట్రవర్షియల్ కామెంట్స్..

బిగ్‌బాస్ శివాజీ ఇప్పటికే ఎన్నోసార్లు కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక మరోసారి శివాజీ రెచ్చిపోయాడు. ఏకంగా అయోధ్య రామ మందిరం పై కీలక ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా శివాజీ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లో సందడి చేస్తున్నాడు. ఈ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న శివాజీ.. హౌస్ నుండి బయటకు వచ్చాక జనాలకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నాడు. బిజెపి పాలిటిక్స్‌ను విమర్శించే క్ర‌మంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో.. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరగబోతుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్ప‌టికే ఆహ్వానం వచ్చింది. అయితే ఎన్నికలవేళ రామ మందిరం ప్రారంభోత్సవం రాజకీయ ప్రయోజనాలకే అంటూ కామెంట్లో వినిపిస్తున్నాయి. ప్రజల మతవిశ్వాసాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుందని ఈ రామ మందిరం ప్రారంభోత్సవం కూడా అందుకేనంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా శివాజీ కూడా ఇదే అంశాన్ని రేయిజ్ చేస్తు.. అయోధ్యలో మాత్రమే రాముడు ఉన్నాడా.. అక్కడ మాత్రమే రామ మందిరం ఉందా.. మా ఊళ్లో కూడా రామాలయం ఉంది.. బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ వివ‌రించాడు.

భారతీయ జీవన విధానమే రామతత్వం అంటారు.. ఈ రాజకీయ పార్టీలు తమ అవసరాలు, అవకాశాల కోసం వీటన్నింటినీ వాడుకుంటున్నాయి అంటూ కామెంట్ చేశాడు. మనుషుల కంటే ప్రకృతి గొప్పది.. అది తలుచుకుంటే మనుషుల దూల తీర్చేస్తుంది.. మనుషులకు కూడా కాని మార్పు దానివల్ల అవుతుంది. కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడి చచ్చారు.. కరోనా కంటే భయంకరమైనవి విజృంభిస్తాయి.. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుంది.. డబ్బే అన్ని అనుకుంటూ జీవించేస్తున్నారు.. మనుషులు చేసే తప్పులు ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది అంటూ శివాజీ కామెంట్ చేశాడు. ఇక శివాజి బిగ్‌బాస్‌ నుంచి బ‌య‌ట‌కు వచ్చిన తర్వాత నటుడిగా వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు.