రాజమౌళి ఇంట్లో ఆయన కాకుండా మరో స్టార్ డైరెక్టర్ ఉన్నారని తెలుసా.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో రాజమౌళి డైరెక్టర్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు అందరికీ తెలుసు. ఇక వాళ్ళ ఇంట్లో సినిమాకు సంబంధించి దాదాపు అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళ రాజమౌళి సినిమాలకు సగం పనులు పూర్తి చేసి పెడతారు. అందుకే తన సినిమా మొత్తానికి వాళ్ళ‌ ఫ్యామిలీని రాజమౌళి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. దీంతో మంచి సక్సెస్ కూడా అందుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్నాయి కూడా. ఇక ఇప్పుడు ఆయన చేయబోయే పాన్ వ‌ర‌ల్డ్ సినిమాతో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలో ఉన్నాడు రాజమౌళి.

SS Rajamouli on father Vijayendra Prasad's film about RSS: I cried reading  the script, but don't about their history - India Today

ఇక ఈయన ఇంట్లో రాజమౌళితో పాటుగా వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ కూడా డైరెక్టర్గా కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అయినప్పటికీ ఆయన డైరెక్టర్గా సక్సెస్ కాలేకపోయాడు. ఇక దాంతో రైటర్ గా స్థిరపడిపోయాడు. రాజమౌళి, తండ్రి విజయేంద్రప్రసాద్.. వీళ్లిద్దరే కాకుండా వాళ్ళ ఇంట్లో మరో డైరెక్టర్ ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. అతని ఎవరో కాదు రాజమౌళి అన్న కాంచీ. రాజమౌళి చదువుకునే రోజుల్లో కాంచీ కొన్ని కథలను చెబుతూ సినిమాలు ఇలా తీయాలి.. అలా తీయాలి అని రాజమాలికి భారీ రేంజ్‌లో ఎక్స్‌ప్లేయిన్‌ చేస్తూ ఉండేవాడట. ఇంట్లో వాళ్ళందరూ కాంచీ పెద్ద డైరెక్టర్ అవుతారని భావించారట.

Tweet By Rajamouli's Brother Sparks An Outrage!

అయితే ఆయన తర్వాత అమృతం సీరియల్ లో కొన్ని ఎపిసోడ్‌లు కూడా డైరెక్షన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన డైరెక్టర్గా సూపర్ సక్సెస్ అవుతాడని భావించారట. ఆయన డైరెక్షన్ లో కొన్ని సినిమాలు స్టార్ట్ అయినప్పటికీ ఏవో కారణాలతో షూటింగ్ దశలోనే ఆగిపోయాయని తెలుస్తుంది. దాంతో ఆయనకి డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ లేక రాజమౌళి సినిమాలకే చాలా వరకు సహాయం చేస్తూ వస్తున్నాడు. అలాగే బయట డైరెక్టర్లకు కూడా కొన్ని కథలను ఇస్తూ కాంచీ ఆ సినిమాలతో సక్సెస్ అవుతున్నాడట. ఇక రాజమౌళి సునీల్ ని హీరోగా పెట్టి తీసిన మర్యాద రామన్న సినిమా కూడా కాంచీ రాసిన కథ కావడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజమౌళి సక్సెస్ కు ఆయన అన్నయ్య కాంచీ కూడా ఓ కార‌ణ‌మా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.