టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని బట్టి నటన పరంగా రామ్ చరణ్ కృషి, పట్టుదల ఎంతలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో మరో సినిమాకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వీలైనంత తొందరలోనే సెట్స్ పైకి రానుంది. అందులో భాగంగానే ఈ సినిమాలో పదినిమిషాలు కనిపించే గెస్ట్ క్యారెక్టర్ కోసం స్టార్ హీరోని తీసుకుందామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం చాలామంది స్టార్ హీరో పేర్లను పరిశీలించిన ఈ క్యారెక్టర్‌కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని డైరెక్టర్ బుచ్చిబాబు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడట.
దీంతో పాటు సల్మాన్ కు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది.. అది కూడా సినిమాకు ప్లస్ అవుతుంది.. కాబట్టి రామ్ చరణ్ కి బుచ్చిబాబు ఈ విషయాని చెప్పడంతో చరణ్ కూడా సల్మాన్ తో సినిమాకు సంబంధించిన డిస్కషన్ లో ఉన్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మంచి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.