21 ఏళ్ల ఇండస్ట్రీలో అతనితో చాలా కంఫర్టబుల్ గా ఉన్న.. నటులను దేవుళ్ళుగా భావిస్తాడు.. ప్రభాస్ కామెంట్స్‌..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ స‌లార్‌. హెంబాలేఫిల్మ్‌స్‌ బ్యానర్ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకని రికార్డ్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక దేవా, వరదలు మధ్య స్నేహం పగగా ఎలా మారింది.. ఇద్దరు స్నేహితుల బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. అనేది ప్రధాన కథ అంశం. ఇక దేవాగా ప్రభాస్ నటించగా.. వరదరాజులుగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించి మెప్పించాడు.

Shruti Haasan Interview with Salaar Team - Part1| Prabhas | Prithviraj | Shruti  Haasan |HombaleFilms - YouTube

దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో గ్రాండ్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ శృతిహాసన్.. పృధ్విరాజ్, ప్రభాస్ లను ఇంటర్వ్యూ చేసి ఫాన్స్ కు ట్రీట్‌ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, పృధ్వీరాజ్.. సలార్ గురించి ప్రశాంత్ నీల్ మేకింగ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తున్నారు. ప్రభాస్ మాట్లాడుతూ తన 21 ఏళ్ల కెరీర్‌లో చాలా కంఫర్టబుల్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటూ వివరించాడు.

నాకు ముందు వినాయక సార్ ఆయనతో చేయడం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అది కేవలం 6 నెలలు.. ఇది దాదాపు రెండేళ్లు.. ఇంకా పార్ట్ 2 లో కూడా అతనితో వర్క్ చేయడం చాలా నచ్చుతుంది.. ఓ విధంగా చెప్పాలంటే షూట్ అయిన తర్వాత కూడా ఆయన కలవాలనిపిస్తుంది అంటూ ప్రభాస్ కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ చాలా కూల్.. చలోక్తులు విసురుతాడు.. అతడు నటులను దేవుళ్ళులా చూస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.