నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఆ స్టార్ డైరెక్టరా..? తెరవనక ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా..?

నిత్యామీనన్.. పేరుకి మలయాళ బ్యూటీనే  అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . అయితే నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీలో సడన్గా సినిమాలు చేయడం ఆపేసింది . దానికి కారణం ఒక బడా ప్రొడ్యూసర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఆ బడా ప్రొడ్యూసర్ ఆమెకు కథ చెప్పే ముందు ఒకలా ..తెరకెక్కించే ముందు మరొకలా సీన్స్ క్రియేట్ చేశారట . ఎడిటింగ్లో ఆమెకు సంబంధించిన సీన్స్ అన్నీ లేపేసారట.  దీంతో ఆ సినిమా హిట్ అయినా సరే నిత్యామీనన్ కి పేరు రాలేదు . ఈ కారణంగానే నిత్యామీనన్ ఆ డైరెక్టర్ పై గుర్రుగా ఉండడంతో తెలుగు సినిమాలను ఓకే చేయడం లేదు అన్న వార్తలు వినిపించాయి.

అయితే నిత్యామీనన్ అందరి హీరోలకు సూట్ అవ్వదని..  హైట్ తక్కువగా ఉండడంతో ఆమెను చాలా మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తున్నారు అని.. ఆ కారణంగానే ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయని మరికొందరు చెప్పుకొస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ.. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి నిత్యామీనన్ దూరమైపోయింది..!!