మహానటి .. ఈ పేరు చెప్తేనే మనకు తెలియకుండా నే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరుకి ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఒకప్పుడు మహానటి అనగానే అందరికీ సావిత్రి గారు గుర్తొచ్చేవారు. ఇప్పుడు మహానటి అనగానే అందరికీ కీర్తి సురేష్ గుర్తొస్తుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకునింది కీర్తి సురేష్.
ఆమె ఇంతటి స్థానం సంపాదించుకోవడానికి కారణం మహానటి సినిమా అని చెప్పక తప్పదు . అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాను మొదటగా హీరోయిన్ నిత్యామీనన్ కోసం రాసుకున్నారట . ఆమెకు కథ కూడా వివరించారట . కానీ నిత్యామీనన్ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ వద్దకు వెళ్లిన ఫైనల్లీ కీర్తి సురేష్ ఈ పాత్రకు సెలెక్ట్ అయింది . సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
ప్రజెంట్ కీర్తి సురేష్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ సినిమా అవకాశాలతో దూసుకుపోతూ ఉంటే.. హీరోయిన్ నిత్యామీనన్ మాత్రం అవకాశాలు లేక అల్లాడిపోతుంది . అందుకే సినిమా ఇండస్ట్రీలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ జనాలు చెప్తూ ఉంటారు. ఏం చేద్దాం టైం అంటే అంతే మరి.. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది..!!