“చచ్చిన ప్రభాస్ తో సినిమా చేయను”.. తెగేసి చెప్పిన తెలుగు బ్యూటీ.. ఎందుకంటే..?

ఎవ్వరైనా సరే రెబెల్ హీరో ప్రభాస్ తో నటించే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు. అసలు ఆయనతో కనీసం రెండు సెకండ్లు అయినా సరే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని .. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ వెయిట్ చేస్తున్నారు . ఈ విషయం మన అందరికీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటి మాత్రం ప్రభాస్ తో చచ్చిన సిస్టర్ రోల్ లో నటించను అంటూ తెగేసి చెప్పేస్తుందట .

 

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన తర్వాత పలు సినిమాలలో సిస్టర్ రోల్స్ లో నటించి మెప్పించింది . ఇలాంటి క్రమంలోనే “మిస్టర్ పర్ఫెక్ట్” సినిమాలో సిస్టర్ రోల్ లో నటించడానికి ఆఫర్ వచ్చిందట. అయితే ప్రభాస్ తన డార్లింగ్ అని తన నోటితో ఆయనను అన్నయ్య అని పిలవలేను అని ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట .

ఇప్పుడే కాదు ఎన్నిసార్లు అలాంటి ఆఫర్ వచ్చినా సరే రిజెక్ట్ చేస్తూనే ఉంటాను అని ..ప్రభాస్ ఎప్పటికీ నా డార్లింగ్ నని.. శ్రీముఖి మేకర్స్ తో తెగేసి చెప్పేసిందట. ప్రభాస్ అంటే శ్రీముఖికి ఎంత ఇష్టమో ఈ ఒక్క డైలాగ్ తోనే అర్థం అయిపోతుంది. కానీ అంత మంచి ఛాన్స్ మిస్ చేసుకుని ఆమె తన లైఫ్ లో సరిదిద్దుకోలేని తప్పు చేసింది అంటున్నారు జనాలు. ప్రజెంట్ శ్రీముఖి పలు షోస్ తో బిజీబిజీగా ముందుకెళ్తుంది . రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ సినిమాలతో దూసుకుపోతున్నాడు..!!