స్టార్ హీరో వెంకటేష్‌కు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వెంకటేష్.. ఎన్నో కుటుంబ నేపధ్యకథలలో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికీ వెంకటేష్ సినిమా వస్తుందంటే ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తో పాటు దగ్గుపాటి ఫ్యామిలీలోని పలువురు వ్యక్తులపై నాంపల్లి కోర్ట్ ఆదేశాల మేరకు కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ కేసు నమోదవడానికి కారణాలు ఏంటి.. ఏం జరిగింది ఒకసారి చూద్దాం.
నందకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్ట్ దర్యాప్తు జరిపింది. నాంపల్లి కోర్ట్ ఆదేశాలను దిక్కరించి డెక్కన్ కిచ్చెన్ హోటల్ కూల్ చేశారని.. అలాగే హోటల్లో కోట్ల రూపాయలు విలువైన ఫర్నిచర్ ను ఎత్తుకు వెళ్లారని.. సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్న అక్రమంగా కూల్చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. జిహెచ్ఎంసి అధికారులు, పోలీసులతో కుమ్మక్కైన వెంకటేష్.. తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని మరీ హోటల్‌ను కూల్ చేశారట.
దానివల్ల ఆయనకు రూ.20 కోట్ల నష్టం వచ్చిందని నందకుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితులపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో వెంకటేష్ కుటుంబ సభ్యులైన అభిరామ్, రాణా, వెంకటేష్ సోదరుడు సురేష్ బాబులపై కూడా కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ ఆదేశాలు పంపింది. ఈ కేసు పై.. అలాగే సదరు వ్యాపారి నందకుమార్ కంప్లైంట్ పై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.