ఎంతోమందికి సహాయం చేస్తూ మంచి మనసు చాటుతున్న కాదంబరి శంకర్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేటిజన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో కాదాంబరి కిరణ్ ఒకరు. ప్రస్తుతం ప‌లు సినిమాలతో కెరీర్ లో బిజీగా గడుపుతున్న ఈయన.. మరోవైపు మనం సైతం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పటివరకు కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలకు సాయం చేసిన కాదాంబరి కిరణ్ తాజాగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు బయట వ్యక్తులకు కూడా సహాయం చేశాడు.

సీనియర్ నటి హెయిర్‌ స్టైలిష్ రంగస్థలం లక్ష్మి కి కాదంబరి కిరణ్ గతంలో రూ.25 వేల విరాళం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరులైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ముక్కు కు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న విదిష అనే బాలికకు చదువుల కోసం, విదేశాలకు వెళుతున్న చంద్రకళ అనే అమ్మాయికి రూ.25 వేల సహాయం అందించాడు. తాజాగా పావలా శ్యామలకు.. కాదంబరి కిరణ్ మరో రూ.6 వేలు అందించాడు. దీంతో ఇప్పటికే కాదంబరి కిరణ్ కు ఎంతో మంది కష్టాల్లో ఉన్నవారు మమ్మల్ని ఆదుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

మనం సైతం ఫౌండేషన్ పేరు కాదంబరి కిరణ్ వల్ల మారుమోగిపోతుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించే మంచి మనసు కొంతమందికే ఉంటుంది. అలాంటి వాళ్లలో మీరు కూడా ఒకరు సార్ అంటూ కాదంబరిని ప్రశంసిస్తున్నారు. అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈయనకు రెమ్యూనరేషన్ మాత్రం లిమిట్ లోనే ఉంటుంది. అయినా నటనతో కంటే సేవా కార్యక్రమాలతోనే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్నాడు. కాగా కాదంబ‌రి కిరణ్ ఆయనకు దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అంటూ.. మరిన్ని సినిమా అవకాశాలు వస్తే బాగుంటుంది అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.