“మాకు ఈ కష్టాలన్ని రవితేజ వల్లే”.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!

తేజ సజ్జ.. ప్రెసెంట్ ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఎలా మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి .. ఇప్పుడు హీరోగా తన సత్తా చాటుతూ స్టార్ హీరోలకి కూడా చెమటలు పట్టించేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసేసాడు తేజసజ్జ.

కాగా రీసెంట్ గా తేజా సజ్జ రవితేజ రుణం తీర్చుకున్నాడు.. హనుమాన్ సినిమాలో కోతి పాత్రకు డబ్బింగ్ చెప్పిన రవితేజ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఆయన నటించిన ఈగల్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు . ఈ క్రమంలోనే తేజసజ్జ తనదైన నాటి డైలాగ్స్ తో రవితేజను ఆకట్టుకున్నాడు . “మీరు సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు ..మాకు ఒక్క సినిమా చేయడమే కష్టంగా మారింది “..

“ఉన్న హీరోయిన్స్ ని మీరే బుక్ చేసుకుంటున్నారు .. మేము ఏ హీరోయిన్ దగ్గరికి వెళ్లిన రవితేజతో సినిమా చేస్తున్నాం అంటున్నారు.. మాకు కాల్ షీట్స్ ఇవ్వట్లేదు ..మా పరిస్థితి ఏంటి ..? అంటూ సరదాగానే మాట్లాడుతూ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చేశారు. ” మా యంగ్ హీరోస్ కి మీ వల్ల కష్టాలు తప్పడం లేదు అంటూ నాటిగా మాట్లాడారు”. ప్రెసెంట్ రవితేజ తో తేజ సజ్జ చేసిన ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..!!