సౌత్ సూపర్ స్టార్ తో కరణ్ జోహార్ పాన్ ఇండియా మూవీ.. ఎవరో గెస్ చేయండి అంటూ..

బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లుగా క్రేజ్ సంపాదించుకున్న వారిలో కరణ్ జోహార్ ఒక‌రు. క‌ర‌ణ్ ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం కెరీర్ ప్రారంభించిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పటికీ కరణ్‌ జోహార్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే కరణ్.. ఆడియన్ పల్స్‌ కు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక గతేడాది రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కహాని సినిమాతో కరణ్ మరో హిట్ అందుకున్నాడు. రణ్‌వీర్‌ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు కొత్త ఏడాది మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

తన ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త పోస్ట్ షేర్ చేసుకున్నాడు. తన రాబోయే ప్రాజెక్టు గురించి వివరాలు షేర్ చేసుకున్నాడు. ఇది ప్రకటన కాదు.. కానీ ఇది సహకారంతో మాత్రమే సాధ్యం.. ఈ సినిమా కోసం గత సంవత్సరం నుండి హార్డ్ వర్క్ చేస్తున్న.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వివరాలను చివరి వరకు రహస్యంగా ఉంచాం.. ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న డైరెక్టర్ కూడా అదే భావించాడు.. అందుకే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ జరిగిందని మేకర్స్ కు కూడా తెలియలేదు అంటూ వివరించాడు. అలాగే మరో మూడు ఆప్షన్స్ ఇచ్చాడు క‌ర‌ణ్‌. నటినట్లను అంచనా వేయాలని ఫ్యాన్స్‌కు వివరించాడు. వారిలో ఒకరు సౌత్ సూపర్ స్టార్.. ఇటీవల పవర్ఫుల్ పాన్ ఇండియా సినిమాలో నటించారు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక హీరోయిన్ గురించి ఆప్షన్ ఇస్తూ తన టాలెంట్, మోషనల్ ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకుంటున్న బ్యూటీ అని చెప్పవచ్చాడు. ఇక మూడో ఆప్షన్ గా తను వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ.. ఎంట్రీ ఇవ్వబోతున్న ఓ నటుడు.. అతడి టాలెంట్ అసాధారణమైనది.. వృత్తి కోసం ఎంతో కష్టపడుతున్నాడు అంటూ వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. సౌత్ సూపర్ హీరో ఎవరా అని సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. కాగా కరణ్‌ జోహార్ తదుపరి ప్రాజెక్టులో పృధ్విరాజ్ సుకుమార‌న్, కాజల్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ వీరి ముగ్గురి గురించే కరణ్ చెప్పారంటూ టాక్ న‌డుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.