“యస్..అది నిజమే”.. ఐశ్వర్య రాయ్ తో విడాకులను కన్ఫామ్ చేసేసిన అభిషేక్ బచ్చన్..!?

ఇది నిజంగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల ఫ్యాన్స్ కు గుండెలు బద్దలైపోయే న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే దీనిపై ఈ జంట రియాక్ట్ కాకపోవడంతో ఇదంతా ఫేక్ అనుకున్నారు . రీసెంట్గా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు ఐశ్వర్యారాయ్ రాకుండా అభిషేక్ బచ్చన్ ఒక్కడే రావడం మళ్లీ వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అన్న వార్తలకు ఆజ్యం పోసింది .

అయితే రీసెంట్గా అభిషేక్ బచ్చన్ ఆ వార్తలను పరోక్షకంగా కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు . ఈ పోస్ట్ చూసిన తర్వాత అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ ఫ్యాన్స్ వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అని ఫిక్స్ అయిపోయారు . అభిషేక్ బచ్చన్ తన పోస్ట్ లో రాసుకోస్తూ..” పరాజయ భయం కలలను నాశనం చేస్తుంది ..కానీ ఆ ఓటమి నుంచి నేర్చుకుంటే కలలు నిజమవుతాయి” అనే విధంగా అభిషేక్ పోస్ట్ చేశారు .

దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ మరోసారి వార్తలు అవుతున్నాయి . ఇంత చక్కటి జంట ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటుంది అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళ విడాకుల వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి ఐశ్వర్య రాయ్.. ఈ పోస్ట్ కు ఎలాంటి రిప్లై ఇస్తుందో..??