బిగ్ బ్రేకింగ్: శోకసంద్రంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ.. ప్రముఖ హీరో తండ్రి మృతి..!!

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ హీరోగా .. స్టార్ హీరోగా పబ్లిసిటీ , పాపులారిటీ సంపాదించుకున్న హీరో తొట్టెంపూడి వేణు తండ్రి కొద్ది కొద్ది సేపటి క్రితమే మృతి చెందారు. వయోభారంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా సినిమా ఇండస్ట్రీలో వేణు తొట్టెంపూడి కి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

పలు మంచి మంచి సినిమాల్లో నటించి ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ప్రెసెంట్ ఆయన చేతుల్లో సినిమాలు లేవు . కానీ అంతకు ముందు మాత్రం ఆయన నటించిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. కాగా ప్రెసెంట్ బిజినెస్ పనులు చూసుకుంటున్న వేణు తప్పంపూడి లైఫ్ ని హ్యాపీగా ముందుకు తీసుకెళుతున్నారు . ఇలాంటి క్రమంలోనే వేణు తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు గారు మృతి చెందడం ఆయనకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

నేడు తెల్లవారుజామున ఆయన పరమపదించారు అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. 92 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు . తొట్టెంపూడి వెంకట సుబ్బారావు గారి భౌతికకాయాన్ని సందర్శన అనంతరం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. వేణు తండ్రి మరణించాడు అన్న వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు..!!