‘ కన్నప్ప ‘ షూటింగ్ కు డేట్స్ ఫిక్స్ చేసిన ప్రభాస్.. ఎన్ని రోజులంటే..?

పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా యాక్షన్ ఫిలిమ్ స‌లార్‌తో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వూసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ దుమ్ము రేపుతుంది. దీంతో ఈ సినిమా పేరు అంత‌ట‌ మారుమ్రోగుతుంది. ప్రస్తుతం ప్ర‌భాస్‌ భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఒక ప‌క్క కల్కి 2898 ఏడి. మ‌రోప‌క్క ది రాజా సాబ్ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. బిజీ స్కెడ్యూలోను కాస్త సమయాన్ని మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమాకు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజా అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు భక్తకన్నప్ప పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. గతేడాది ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో శ‌ర‌వేగంగా జరుగుతున్న ఈ సినిమా షూట్ లో ఇప్పటికే మలయాళనటుడు మోహన్ లాల్.. మరి కొంతమంది నటులు హాజరయ్యారట. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వంతు రావడంతో.. షూటింగ్ కోసం రెబల్ స్టార్ డేట్స్ కేటాయించాడని తెలుస్తుంది. ఫిబ్రవరి నెల 17 నుంచి 19 వరకు ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమా పూర్తి షూట్‌ న్యూజిలాండ్ లోనే జ‌ర‌గ‌నుంద‌ట‌. విష్ణు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన క‌న్న‌ప్ప పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దీంతో నెక్స్ట్ అప్డేట్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తుండడం గమనార్హం. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ పరమేశ్వరుడ్డి పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా ఇండియన్ ఫిలిం గా తెరకెక్కిస్తున్నారు. మహాభారత సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో నయనతార, అనుష్క నటిస్తున్నారని సమాచారం. ఇక ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తుండడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగిస్తుంది.