హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలు గొప్పేమి కాదు.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కామెంట్స్..

ఒకప్పుడు ఇండియన్ మూవీ అనగానే బాలీవుడ్ మూవీ నే చెప్పేవారు. ఇప్పుడు బాహుబలి సిరీస్ తర్వాత సౌత్ సినిమాల హవా కూడా పెరిగిపోయింది. కంటెంట్ ఉంటే భాషతో సంభంధం లేకుండా ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ అయిపోయింది. బాహుబలి 2 తర్వాత సౌత్ పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి ఎన్నో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాయి. కేజీఎఫ్ సిరీస్‌లు, సాహో, పుష్ప, కాంతార, కార్తికేయ 2, హనుమాన్ ఇలా ఎన్నో సినిమాలు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల సినిమాలకు సాధారణ రెస్పాన్స్ కూడా రావడం లేదు.

సౌత్ సినిమాలు మాత్రం వందల కోట్లలో కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ పని అయిపోయింది.. సౌత్ ఇండియా సినిమాలు డామినేట్ చేస్తున్నాయని వాదన నెట్టింట మొదలైంది. ఈ అభిప్రాయాన్ని లెజెండ్రి నటుడు అమితాబచ్చన్ ఖండించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ మాట్లాడుతూ సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని.. కొందరు భావిస్తున్నారు. నిజానికి ప్రకృతి, ప్రపంచం దయనందిన జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటనలే సినిమాల కథలకు స్ఫూర్తి. ఈమధ్య ప్రాంతీయ భాష సినిమాలు ఎక్కువ ఆదరణ అందుకుంటున్నాయి.

Why Amitabh Bachchan hates the word 'Bollywood'

ఈ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అద్భుతం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మీ సినిమాలు చాలా బాగున్నాయి అని సౌత్ వారికి చెబితే బాలీవుడ్ సినిమాలే మేము తెరకెక్కిస్తున్నాం అంటున్నారు. శక్తి, షోలే లాంటి సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నామని అంటున్నారు. కాగా మలయాళం సినిమాలు వాటికవి చాలా ప్రత్యేకం. అలాగని బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ గొప్పది అని అనడం లేదు అంటూ అమితాబ్ వివరించాడు. ఇక ప్రస్తుతం అమితా సౌత్ సినిమాగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి మూవీలో కీలక పాత్రలు నటిస్తున్నాడు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.