ఆ పెళ్లైన స్టార్ హీరో ప్రేమలో అనుపమ.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివిల్ అయినా సీక్రెట్..

నితిన్ ఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. నిన్న మొన్నటి వరకు సాంప్రదాయబ‌ద్ధమైన పాత్రలోనే నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో హోమ్లీ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న అనుపమ.. టిల్లు స్క్వేర్ సినిమాతో రొమాంటిక్ బ్యూటీగా మారిపోయింది. సినిమాల్లో టిల్లు గాడితో లిప్ లాక్ సీన్లు, రొమాన్స్ తో కుర్రాళ్ళను మరింత కట్టిప‌డేయ‌టానికి రెడీ అయిపోతుంది.

ఇక దీంతోపాటే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. పలు గ్లామర్ షోలతో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్ళలో మరింత హీట్ పెంచేస్తుంది. కాక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన ఫేవరెట్ హీరో గురించి అడగగా ఇలా స్పందించింది. మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే బాగా ఇష్టమని ఎదురైన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఇండస్ట్రీలో నాకు అందరు హీరోలు ఒకటే అంటూ చెప్పుకొచ్చింది.

200+] Allu Arjun Pictures | Wallpapers.com

కానీ ఒక్క హీరోనే ప్రత్యేకంగా ఎంచుకోవాలంటే రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఆయన అందరిలోనూ నా ఫేవరెట్ హీరో అంటూ అల్లు అర్జున్ పై తనకు ఉన్న ప్రేమ గురించి వివరించింది. అనుపమ పరమేశ్వరన్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవ్వడంతో.. అయ్యో బన్నీకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అనుపమ.. పెళ్ళికాని హీరోలు ఎవరైనా సెలెక్ట్ చేసుకో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.