23 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్న.. కానీ ఇంకా చేసుకోకపోవడానికి కారణం ఇదే.. సాయి పల్లవి

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే అందరిని ఫిదా చేసేసింది. తెలుగులో నాచురల్ స్టార్ గా క్రేజ్‌ను సంపాదించుకుంది. తర్వాత విరాటపర్వం, పడి పడి లేచే మనసు, ఎంసీఏ, మారి 2.. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె అందం, అభినయం, డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ గ‌త‌కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కాగా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

అయితే సాయి ప‌ల్ల‌వి చెల్లెలు పూజ కన్నన్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇటీవల ఆమె ఎంగేజ్మెంట్ ఫిక్స్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సాయి పల్లవి మ్యారేజ్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె వివాహం చేసుకోకుండానే చెల్లెలు పూజ కన్నన్‌ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ జనాలు నెట్టింట‌ చర్చలు మొదలుపెట్టారు. అయితే గతంలోనే సాయి పల్లవి పెళ్లిపై ప‌లు ప్రశ్నలకు ఇలా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది.

నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకి వివాహం చేసుకోన్ని.. 30 ఏళ్ల లోపు పిల్లలు కన్నేయాలని అనుకున్నాను. కానీ అప్పుడు ఎంబిబిఎస్ చేస్తున్నా.. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఇంట్లో కొన్ని బాధ్యతలు నాపై పడ్డాయి. దీంతో పెళ్లి వియిదా వేసా.. ఇక సినిమాల్లో మంచి పేరు రావడంతో పెళ్ళికి మరి కొంత టైం తీసుకోవాలనుకుంటున్న అంటూ సాయి పల్లవి వివరించింది. కాగా గతంలో సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం పూజా కాన్న‌న్ పెళ్లి వార్తలతో మరోసారి వైరల్ అవుతున్నాయి.